భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర

0
317

బాపట్ల, 

సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా కలెక్టర్‌కు ఓ రైతు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో సక్రమంగా ఉన్న భూమి, ఆన్‌లైన్ రికార్డులకు వచ్చేసరికి గందరగోళంగా మారిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా అన్నం బోట్లవారి పాలెం గ్రామానికి చెందిన రైతు తూబాటి శివకోటేశ్వరరావుకు గ్రామంలోని సర్వే నంబర్ 213 సి లో 1 ఎకరం 39 సెంట్ల మెట్ట భూమి ఉంది. రిజిస్టర్ రికార్డుల ప్రకారం ఈ భూమి ఆయన పేరు మీదే ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్ ) రికార్డుల్లో మాత్రం తప్పుగా నమోదైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సర్వే నంబర్ 213 ఎ లో 0.39 సెంట్లు మీద, 213 బి లో 0.39 సెంట్లు మీద ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని, అయితే తన రికార్డుల్లో ఉండాల్సిన 1.39 ఎకరాలకు గాను కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తోందని బాధితుడు వివరించారు.

రికార్డుల తారుమారుని సాకుగా చూపి, కొంతమంది వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శివకోటేశ్వరరావు ఆరోపించారు. తన పొలానికి పక్కనే ఉన్న చెన్నపాటి కోట సుబ్బారావు, చెన్నపాటి అంకమ్మ, చెన్నపాటి ధర్మ, ముక్కా శ్రీను తదితరులు గట్టు పంచాయితీలు సృష్టించి, మట్టి తోలుతూ తన భూమిని ఆక్రమించేందుకు అడ్డుపడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించి తన భూమి రికార్డులను సరిచేసి, ఆక్రమణదారుల నుండి తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని ఆయన జిల్లా అధికారులను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర కేబినెట్ భేటీ
*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*   *ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*...
By Rajini Kumari 2026-04-18 17:26:34 0 151
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:   విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర...
By Rajini Kumari 2025-12-30 10:30:36 0 252
SURAKSHA
రోడ్డు ద్రతభ - ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
మాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్...
By Kalaga Sailaja 2026-06-29 08:05:33 0 193
Andhra Pradesh
సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
  సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 07-05-2026 Thu...
By Pagadala Venkateswar 2026-05-07 07:00:00 0 150
SURAKSHA
Rajasthan Police Launch Dedicated Cyber Crime Cells
In response to the sharp rise in digital threats, the Rajasthan Police have established dedicated...
By Lokeshwari Panthadi 2026-07-04 08:20:24 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com