తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

0
515

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణలోని బహుజన ప్రజలంతా పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో 100 మందిని ప్రభావితం చేస్తూ భూపాలపల్లిలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు పార్టీ గ్రామ కమిటీ కార్యకర్తలు, నాయకులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
G. Sudheer Babu IPS: Former Commissioner of Future City Police 1
# Guardian of the Future City:   The Resolute Journey of G. Sudheer Babu, IPS## A...
By Kalaga Sailaja 2026-07-11 06:04:15 0 229
Andhra Pradesh
.బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పెద్దిరెడ్డి
సోమవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-02-16 12:27:15 0 224
SURAKSHA
P. Pravinya, IAS: Inspiring Excellence in Public Service
From cracking the UPSC at a young age to leading key districts in Telangana, P. Pravinya, IAS,...
By Lokeshwari Panthadi 2026-07-14 07:02:27 0 249
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు 06-02-2026 Fri...
By Pagadala Venkateswar 2026-02-06 13:24:19 0 374
Telangana
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:18:30 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com