రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు

0
187

సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి. రాజనీకాంత్, డాక్టర్ ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో 'రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం జరిగింది. వానాకాలం సీజన్‌కు ముందు రైతులు విత్తన రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు రసాయన ఎరువుల (ముఖ్యంగా యూరియా) మితిమీరిన వాడకం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీనివల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రసాయన పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ మరియు నీటిని పొదుపుగా వాడుకుంటూ, పంటల సాగును ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు చంద్ర శేఖర్, శిరీష, వసీమ మరియు రైతులు పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్...
By Boya Dasthagiri 2026-05-20 12:14:20 0 237
Telangana
టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలి
రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్...
By Pinnehasan Odela 2026-05-06 08:49:46 0 334
Andhra Pradesh
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
By John Baji 2026-01-01 03:25:30 0 233
Nagaland
Zunheboto Halts Illegal Commercial LPG Misuse
The Zunheboto district administration has launched a strict regulatory enforcement drive...
By Lokeshwari Panthadi 2026-06-26 07:17:39 0 74
Uttarkhand
Dehradun Police Track Haryana Leads in Station Blast Threat
Dehradun police have launched an intense investigation following a serious security threat...
By Lokeshwari Panthadi 2026-06-29 08:17:50 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com