పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
Posted 2026-05-11 09:51:09
0
404
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97 విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగినది.ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో ఎక్కడెక్కడ స్థిరపడినవారు తమ కుటుంబ సమేతంగా అందరూ కలుసుకొని చదువుకున్న చిన్ననాటి గత స్మృతులు గుర్తుచేసుకొని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది.ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కలయికలో తమతో పాటు చదువుకున్న కొంతమంది స్నేహితులు చనిపోవడం చాలా బాధాకరమని వాళ్లని స్మరించుకోవడం జరిగింది.1994-97 లో టీచర్ గా పని చేసిన బొందలపాటి అప్పారావు , జూలూరు చంద్రమౌలేశ్వరరావు,జంధ్యాల రామస్వామి శాస్త్రి ,జంధ్యాల రాజ్యలక్ష్మి ను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్...
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
*ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*
*క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం...
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
TN Police Today: Guardians Of Road Safety Now
Today TN traffic police focused on saving lives on roads. School zones in Chennai, Salem,...