Bharat Aawaz

బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
192
Views

ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే…

‎36 గంటలు గడిచినా చర్యలు లేవు..!

‎“ప్రజల గొంతు” అని చెప్పుకునే పెద్ద పెద్ద చానెల్స్ కూడా మౌనం..!

‎📰 బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?

ఇదే ఒక సామాన్యుడు అయితే…

‎పోలీసుల వేగం వేరేలా ఉండేది కాదా..?

‎ఎన్‌కౌంటర్ మాటలు… మీడియా ట్రయల్స్… సోషల్ మీడియాలో తీర్పులు వచ్చేవి కాదా..?

‎నేతల మూతుల నేతి వాసన పీల్చి బ్రతికే మీడియా ఇంకా ఎన్నాళ్లు..?

‎❓అధికారుల ముందు నిజం మాట్లాడలేని వ్యవస్థ ఇంకా ఎన్నాళ్లు..?

‎ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమా..?

‎లేక… పెద్ద మనుషులకు మాత్రమే పనిచేసే ప్రజాస్వామ్యమా..?

‎నేరం ఎవరు చేసినా నేరమే…

‎సామాన్యుడైనా… అధికార పార్టీ నేత కొడుకైనా చట్టం ఒక్కటే కావాలి..!

‎ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది..!