ఈనెల 11న ఆర్ టి ఐ హెచ్ స్టార్ట్ అప్ ఎక్స్పో జాతీయ సాంకేతిక దినోత్సవం కలెక్టర్ లక్ష్మీశ

0
173

*పత్రికా ప్రకటన*

*ఎన్‌టీఆర్ జిల్లా, మే 09, 2026*

 

*ఈ నెల 11న ఆర్‌టీఐహెచ్‌- స్టార్ట‌ప్ ఎక్స్‌పో*

- *జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు*

- *యువ ఆవిష్కర్తల మేధో ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌రైన వేదిక‌*

- *జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ*

 

ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సంద‌ర్భంగా విజయవాడ, ఎనికేపాడులోని ర‌త‌న్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్‌)లో స్టార్టప్ ఎక్స్‌పో నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. 

ఈ మేర‌కు ఆయ‌న శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడ జోన్ పరిధిలోని అన్ని స్టార్టప్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొనవచ్చని తెలిపారు. స్టార్టప్‌లకు ప్రత్యేక స్టాళ్ల‌తో వారి ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నమూనాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉత్తమ స్టార్టప్‌లకు నగదు బహుమతులు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి బహుమతి – రూ. 30,000, ద్వితీయ బహుమతి – రూ. 20,000, మూడో బహుమతి – రూ. 15,000 ఉంటుంద‌ని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో ప్రతిభ కనబరుస్తున్న యువత, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్య‌క్ర‌మం పూర్తి వివరాల కోసం: 9154970454 లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Industrial Growth and Investment Drive
Andhra Pradesh continues to strengthen its position as an emerging industrial hub through...
By Fathima Safa 2026-06-17 05:12:26 0 147
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:45 0 173
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇంజనీరింగ్ పనులు పునః ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న...
By Rajini Kumari 2026-01-19 11:11:44 0 223
Telangana
ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ...
By Sidhu Maroju 2026-06-23 09:22:26 2 1K
Telangana
నిజామాబాద్:నెటినుండి బిజెపి శిక్షణతరగాథులు
పండిత్ దినుదయల్  ప్రశిక్షణ తారగతులు గురువరం ప్రారంభం కనున్నయీ. గురువరం ఉదయం నుండి శుక్రవారం...
By Sadaq Sadaq 2026-05-28 03:18:33 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com