రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం

0
311

 

 

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.నందిగామ పట్టణం కాకాని నగర్‌లో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాకాని నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ పైప్‌లైన్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఆమె, ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ల డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
నిజామాబాద్ లో ఉపాధ్యాయుడిపై దాడి - BJP నేత అరెస్ట్
చట్టం ముందు అందరూ సమానమే. నిజామాబాద్ పెర్కిట్ గ్రామంలో Bharat Chandra High School principal పై...
By Kalaga Sailaja 2026-06-30 04:58:08 0 257
Telangana
ఎండవేడులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి...
By Gujile Ramu 2026-05-03 15:41:34 0 177
Telangana
బచపన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బచ్‌పన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-12 16:26:46 0 164
Andhra Pradesh
పుంగనూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-03-01 12:38:16 0 159
Maharashtra
Kolhapur’s Ambabai Temple Transformation Plan
he historic Shri Ambabai (Mahalaxmi) Temple in Kolhapur is set for a massive transformation...
By Lokeshwari Panthadi 2026-06-27 06:44:16 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com