భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!

0
190

హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకుందని హైడ్రా కమీషనర్ పేర్కొన్నారు.హైడ్రా తన కార్యకలాపాలతో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఆయన ప్రకటించారు. మరో సంవత్సరంలోగా రూ.1లక్ష కోట్లు విలువైన భూములను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

‎హైడ్రా పరిధిలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందని కమిషనర్ వెల్లడించారు. భూ కబ్జాలకు సంబంధించి హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ అంకితభావంతో, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా హైడ్రా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Search
Categories
Read More
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
Andhra Pradesh
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 10-06-2026 Wed 07:14...
By Pagadala Venkateswar 2026-06-10 05:50:36 0 99
Andhra Pradesh
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-04-06 04:43:21 0 363
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు - సిపి. సజ్జనార్.IPS.|
హైదరాబాద్ :  నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు...
By Sidhu Maroju 2025-12-24 05:14:26 0 293
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com