చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు

0
314

 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు అభిలాష్ (తండ్రి కొడుకులు ), కొత్తూరు గ్రామంలో గుండారపు వెంకటేష్( 23) రైతు కుటుంబాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంచిర్యాల జిల్లా కమిటీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాలుగు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వరి ధాన్యం కోసి 25 రోజులు గడిచిన ఇంకా కల్లాలకే పరిమితమైన వరి ధాన్యం అకాల వర్షం, గాలి దుమారాం నుంచి కాపాడుకునే క్రమంలో అక్కడ గోడ ప్రక్కన నిలవడం వల్ల గాలి దుమారానికి ఆ గోడ కూలి ముగ్గురు రైతులు, ఒక కౌలు రైతు చనిపోయారు. చనిపోయిన రైతు కుటుంబాల బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం సరైన సమయంలో వరి కొను గోలు చేస్తే ఇలా జరిగి ఉండేది కాదు. చనిపోయిన రైతు కుటుంబాలను ఇప్పటివరకు అధికారులు కానీ, నాయకులు పరామర్శించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వరి కొనుగోళ్లు వేగవంతం చేసి కోతలు లేకుండా చూడాలి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక కోటి రూపాయలు చెల్లించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, కనికర అశోక్, ప్రకాష్, బోడెంకి చందు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు, ఉమా రాణి, దూలం శ్రీనివాస్, రాజారామ్, , శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 215
Nagaland
Jakhama Hosts 3rd Potato Festival
The third edition of the popular Nagaland Potato Festival 2026 took place at the Jakhama Village...
By Dunna Jessicaruth 2026-05-16 07:04:16 0 146
BMA
Surveillance and Source Safety
The rise of sophisticated digital surveillance poses new threats to journalists and their...
By JoinBMA 2026-08-19 04:33:50 0 77
Andhra Pradesh
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా* నందిగామ,ఎన్టీఆర్ జిల్లా మదీనా...
By Patan Khuddus 2026-04-17 13:54:11 0 281
Andhra Pradesh
ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు.
    ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు 11-06-2026...
By Pagadala Venkateswar 2026-06-11 05:44:09 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com