మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు

0
213

నస్పూర్ : తేదీ  07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మరియు మొన్న లక్షెట్టిపేట్ మండలంలో చనిపోయిన నలుగురు రైతులకు ఒక్కక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన రహదారి పై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణ, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో రైతులు పండించిన ధాన్యాన్ని బస్తాకు నాలుగు కిలోల చొప్పున దోచుకుంటుంది అని, కాంట పెట్టిన ధాన్యాన్ని లారీల కొరతతో తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్థానిక ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అయ్యి కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
By Chennaiah Kati 2026-07-22 15:30:03 0 249
Telangana
నిజామాబాద్: జిల్లాలో.488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.కలెక్టర్
నిజామాబాద్ జిల్లా నగరపాలక సంస్థ పరిధిలో ని 60 డివిజన్లాలో ఎన్నికల కోసం 488 పోలింగేంద్రాలను సిద్దం...
By Sadaq Sadaq 2026-02-10 16:19:52 0 252
Telangana
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
By Sidhu Maroju 2026-03-25 04:39:46 0 189
Telangana
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి...
By Sidhu Maroju 2025-11-14 14:00:33 0 247
Andhra Pradesh
APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది....
By John Baji 2025-12-28 14:40:15 0 366
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com