‎నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

0
148

తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళుతున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

‎తాను వెళుతున్న క్రమంలో, ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున ఆగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని అన్నారు. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నించారు. అలా చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 342
Haryana
Haryana Strengthens Women and Child Welfare Programs
Haryana continues to enhance women and child welfare through focused initiatives in education,...
By Fathima Safa 2026-06-30 13:15:30 0 144
Telangana
నిజామాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి...
By Sadaq Sadaq 2026-05-26 02:55:22 0 105
Telangana
బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Avunoori Mahesh 2026-06-01 22:42:37 0 293
Andhra Pradesh
టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
*టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ శ్రేణుల...
By Rajini Kumari 2026-04-15 13:28:49 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com