Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.

0
202

సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించారు. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో ఆయన సమావేశమై, రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు.

 

భేటీలో ప్రధానంగా రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకంగా ఉన్న "స్టాప్ వర్క్ ఆర్డర్‌"ను శాశ్వతంగా ఎత్తివేయాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అలాగే, భూసేకరణ, పునరావాసం వంటి పనులు చేపట్టాల్సిన ఫేజ్-IIకు అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

అనంతరం, గోదావరి వరద జలాలను రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు గురించి వివరించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 

అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారంపైనా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య ఉన్న వంశధార నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రైబ్యునల్ తుది నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించాలని, తద్వారా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. 

 

అలగే ఏపీ-తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, దీని పరిష్కారానికి తక్షణమే గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎగువ కృష్ణాపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదనపై ఏపీ అభ్యంతరాలను బలంగా వినిపించారు. డ్యామ్ ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఏపీకి నీటి ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి
వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26...
By Vadlamudi NagaVenkat 2026-04-20 04:49:46 0 268
Telangana
విధేషాల్లో దొరల పిల్లలు, రోడ్ల మీద పేద ఇంజనీర్లు డాక్టర్స్ 🔥🔥🔥🔥
వెళ్ళాలి వెళ్ళాలి  ఇక్కడే వుంది చదువుకోనే, అంటే అర్థం చదువుకోవటానికి, రాజకీయా నాయకుల...
By Chakrala Sadhanand 2026-08-19 23:42:21 0 222
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-28 06:35:00 0 152
Andhra Pradesh
పుంగనూరులో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు...
By Kothuru Murali 2026-04-22 12:13:28 0 137
Telangana
ఇది స్మార్ట్ సిటీ కాదు కాదు స్మార్ట్ నగరమే
భారత్ అవాజ్ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మంచిర్యాల...
By Thalakokkula Sadanandam 2026-07-30 09:18:02 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com