"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|

0
382

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య వాతావరణంలో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు, అధికారులు పరస్పర సహకారంతో ముందుకు వెళితే ఎలాంటి సమస్యలు తలెత్తవని అన్నారు.

సమావేశంలో పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను జరుపుకోవాలని, జంతు బలి నిర్వహణలో నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, శబ్ద కాలుష్య నియంత్రణ వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం, ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే పండుగలు శాంతియుతంగా జరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్సైలు, తరుణ్ రెడ్డి,  రాఘవేందర్ రెడ్డి, దేవేందర్, మల్లేష్, గీత, ఏఎస్ఐ తులసిరామ్, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
ఫ్రెండ్లీ పోలీసింగ్: తెలంగాణ పోలీసుల మానవీయ కోణం
తెలంగాణ పోలీసు వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు "ఫ్రెండ్లీ పోలీసింగ్". ఒకప్పుడు పోలీస్...
By Kalaga Sailaja 2026-06-25 06:18:26 0 79
BMA
Pirate Nodes: Community Wi-Fi Saving Flood Victims
During devastating cyclones when commercial telecom towers collapse, local reporters are...
By JoinBMA 2026-08-21 11:23:19 0 299
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 14:53:41 0 248
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:46 0 164
Telangana
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన...
By Nookapangu Manikanta 2026-04-20 05:56:30 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com