తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం

0
181

తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌ ఆహార భద్రత కోసం రాష్ట్రంలో పంటల మార్పిడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించాలని.. పంటల మార్పిడి లక్ష్యాలను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సంవత్సరాల వారీగా, గ్రామాల వారీగా నిర్ణయించాలని కమిషన్‌ సూచించింది. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ సమస్య ప్రధానంగా ఉందని పేర్కొంది. కేరళ తరహాలో రాష్ట్రంలో కూరగాయల క్లస్టర్‌ను, నాసిక్‌లోని సహ్యద్రి ఫార్మ్స్‌ తరహాలో ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో పంటల మార్పిడి అంశంపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికను మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. మొత్తం 40 పేజీల నివేదికలో ఉద్యాన, సాంప్రదాయ, ఇతర ముఖ్య పంటల వివరాలను, ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం వివరాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను వివరంగా పేర్కొంది. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) నిర్ణయించాలని.. ఇందుకోసం రైతులు సభ్యులుగా ఉండే ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరింది. రాష్ట్రంలో మార్కెట్లను సందర్శించినప్పుడు దళారీ వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా గుర్తించామని, దాన్ని నియంత్రించాలని సూచించింది.

Search
Categories
Read More
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 111
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 399
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 05:41:03 0 198
Andhra Pradesh
మైనర్ బాలిక గర్భం వెనుక గురువు? కేసు నమోదు.
మదనపల్లెలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గురువారం...
By Pagadala Venkateswar 2026-04-23 08:41:29 0 130
Telangana
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు...
By Ponnala Srinivasrao 2026-04-30 03:15:43 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com