రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు

0
201

యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు నిలదీశారు.

‎రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు మండిపడ్డారు.

‎చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందన్నారు. యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

‎స్టాక్ ఉన్నా.. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదు, యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

‎యూరియా అమ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి, ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్‌ రైతుల పాలిట శాపంగామారిందన్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గం అన్నారు.

‎రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నఅనధికారిక బ్యాన్..

‎ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదం అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమే అన్నారు.

‎రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమలులో ఫెయిల్,రుణమాఫీ చేయడంలో ఫెయిల్‌ యూరియా సరఫరాలో ఫెయిల్,పంట కొనుగోళ్లు చేయడంలో ఫెయిల్,కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్‌, వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.

‎రైతులు నిలదీతకు బయపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వలే నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ.
గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం...
By Pagadala Venkateswar 2026-03-06 03:07:57 0 192
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 415
Andhra Pradesh
మదనపల్లి: సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ పార్క్ సమీపంలో ఉన్న సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-06-20 04:30:33 0 104
Ladakh
Renewable Energy and Solar Power Growth in Ladakh
Ladakh is emerging as a key center for renewable energy development in India, with a strong focus...
By Fathima Safa 2026-06-24 09:45:19 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com