కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం

0
212

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ వ్యాపారవేత్త నుంచి కేటుగాళ్లు రూ.2.15 కోట్లు దోచుకోవడం సంచలనం రేపింది.

‎హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు. మరో ఫ్లాట్‌ను దివాకర్ బాబు పర్వతనేని అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. అయితే సదరు వ్యాపారవేత్తతో దివాకర్ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ముత్తంగి సమీపంలో తనకు రూ.2.15 కోట్ల విలువైన 1.19 గుంటల భూమి ఉందని, దాన్ని తక్కువ ధరకే అమ్మాలని అనుకుంటున్నానని చెప్పాడు. దివాకర్‌కు అతని సోదరి కూడా మద్దతుగా ఉంది. వారి మాటలను నమ్మిన వ్యాపారవేత్త రెండు విడతల్లో రూ.2.15 కోట్లు బదిలీ చేశాడు. దీంతో కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వ్యాపారవేత్తను తీసుకెళ్లిన దివాకర్.. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లుగా నమ్మించాడు.

‎అలాగే నిజాంపేటలో ఉన్న వ్యాపారవేత్తకు ఉన్న విల్లాను కూడా అమ్మిపెడతానని అతని నుంచి దివాకర్ పత్రాలు తీసుకున్నాడు. అనంతరం సంతకం ఫోర్జరీ చేసి లింగారెడ్డి అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేశాడు. ఇటీవల విల్లాను స్వాధీనం చేసుకునేందుకు లింగారెడ్డి వచ్చిన క్రమంలో ఈ మోసం బయటపడింది. వెంటనే కంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. అసలు తన పేరిట ఎలాంటి భూమి రిజిస్ట్రేషన్ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
BMA
The Unsung Heroes: Financial Crisis of News Hawkers
The physical distribution backbone of the Indian press—newspaper vendors and...
By JoinBMA 2026-08-21 04:46:54 0 106
Andhra Pradesh
కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు
పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి...
By Kothuru Murali 2026-03-02 03:32:59 0 167
SURAKSHA
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
By Lokeshwari Panthadi 2026-07-24 10:44:50 0 167
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-21 03:07:41 0 144
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర...
By Kothuru Murali 2026-08-07 13:21:02 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com