హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్

0
199

రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత

‎తర్వాత మూడు గంటల్లోనే మాట మార్చారని ఆరోపణ

‎కూల్చిన క్రషర్లు తిరుమల కంపెనీవని ప్రకటించారని ఆగ్రహం

‎అక్రమ మైనింగ్ క్రషర్లకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూడు గంటల్లోనే మాటమార్చాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం తొమ్మిది గంటలకు కొత్వాల్‌గూడలో రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన అక్రమ మైనింగ్ క్రషర్లు కూల్చివేశామని హైడ్రా ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ మళ్లీ 12 గంటలకు అవి తిరుమల కంపెనీకి చెందినవని తెలిపిందని అన్నారు.

‎మూడు గంటల్లో హైడ్రా కమిషనర్‌ను ఎవరు బెదిరించారని ప్రశ్నించారు. ఎవరికి భయపడి ప్రకటనలో మార్పు చేసి విడుదల చేశారో చెప్పాలని అన్నారు. కూల్చివేసిన క్రషర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని బీఆర్ఎస్ వాళ్లు ఆధారాలతో బయటపెట్టారని అన్నారు. అలాంటప్పుడు అది మంత్రిది కాదని చెప్పడానికి రంగనాథ్ ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‎ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం తొమ్మిది గంటలకు కొత్వాల్‌గూడలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన అక్రమ మైనింగ్ క్రషర్లు కూల్చివేశామని హైడ్రా ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు.

‎హైడ్రా అక్రమ క్రషర్లపై చర్యలు తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. కానీ దానిలో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆస్తులు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నట్లు తాము ఫిబ్రవరిలో బయటపెట్టామని అన్నారు. మంత్రి పదవిలో కూర్చుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ఆయన ఇన్నేళ్లుగా రూ.500 కోట్ల విలువైన మైనింగ్ సంపదను తరలించారని, దానిని తిరిగి ఎలా రాబడుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:09:58 0 168
Andhra Pradesh
Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
  Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!...
By Pagadala Venkateswar 2026-02-28 08:41:21 0 366
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 1K
Telangana
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
By Bonagiri RaviShankar 2026-05-24 23:03:30 0 167
Telangana
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి   నిజామాబాద్ పోలీస్...
By Chakrala Sadhanand 2026-08-14 17:14:44 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com