వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

0
158

వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

‎వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతరత్రా అంశాల పై కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్‌ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై నిలదీయాలని సూచించినట్లు సమాచారం. ‘రైతుల పంటలను కొనుగోలు చేయడంలో సర్కారు విఫలమవ్వడం, యాసంగి రైతు భరోసా ఇప్పటికీ పూర్తిగా అందించకపోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులు, యాసంగి పంటలు చివరిదశలో ఉన్న నేపథ్యంలో కరెంట్‌ కోతలపై సర్కారును సభావేదిక సాక్షిగా నిలదీయాలి. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రభుత్వ వైఖరిని రైతు సభలో ఎండగట్టాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది.

‎ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 227
Telangana
‎నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో..!బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు
17 ఏళ్ల మైనర్ బాలిక, పోక్సో కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు ‎బండి...
By Ponnala Srinivasrao 2026-05-12 01:19:21 0 158
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 200
SURAKSHA
Centre Approves ₹733 Crore Maharashtra Police Mega Plan
The Central Government has approved a landmark ₹733.28 crore modernization scheme to transform...
By Lokeshwari Panthadi 2026-07-04 07:40:17 0 179
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 05:08:00 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com