పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.

0
140

 

పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన

01-05-2026 Fri 21:57 | Andhra

Nara Lokesh Responds to Pawan Kalyans Praise on Tenth Results

ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల 

గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు

పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్‌

ధన్యవాదాలు తెలిపిన లోకేష్ 

కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి

విద్యాశాఖను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హామీ

పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. "పవనన్నా ఇది మనందరి విజయం" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ, ప్రభుత్వం సమష్టిగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పవన్ కల్యాణ్ ప్రోత్సాహం, అందరి సహకారంతో ఏపీ విద్యాశాఖను దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతానని లోకేష్ స్పష్టం చేశారు.

 

అంతకుముందు, పదో తరగతి ఫలితాలపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యాశాఖలో మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని, కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే అద్భుత ఫలితాలు వచ్చాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పెరిగిందని పవన్ గుర్తుచేశారు.

 

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరగడం శుభపరిణామమన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక వంటివి సత్ఫలితాలనిచ్చాయని ఆయన వివరించారు. ఈ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు పవన్ అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 1K
SURAKSHA
Govind Gupta IPS: Leading Rajasthan's Fight Against Corruption
A distinguished 1993-batch Rajasthan cadre IPS officer, Govind Gupta combines technical...
By Lokeshwari Panthadi 2026-08-01 06:36:28 0 300
SURAKSHA
Kailash Makwana, IPS: Leading with Courage and Integrity
The Journey Begins "A police officer's greatest responsibility is to uphold the law while...
By Fathima Safa 2026-07-20 13:45:40 0 102
Telangana
వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
  *వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్* మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల...
By Bheeshman King 2025-12-13 13:09:25 0 426
SURAKSHA
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
By Kalaga Sailaja 2026-07-27 06:14:17 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com