"డీజీపీ. C V. ఆనంద్, ముఖ్యమంత్రితో భేటీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.|

0
479

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బంజారాహిల్స్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో మర్యాదపూర్వకంగా కలిశారు. 

తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్  ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి  ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందిన తర్వాత, మే 1వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ కనబరిచిన సమర్థవంతమైన పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆయన సీనియారిటీకి పట్టం కడుతూ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ' బి ' గ్రేడ్
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్నత విద్యశాఖ ' బి ' గ్రేడ్ గుర్తింపునిచ్చింది. బుధవారం ఆడిట్...
By Shyamala Yadagiri 2026-04-09 04:55:00 0 282
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 527
SURAKSHA
R. K. Mallick, IPS: A Guardian of Law and Public Trust
The Journey begins "A police officer's greatest responsibility is not merely...
By Fathima Safa 2026-07-28 13:28:42 0 148
Andhra Pradesh
పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
By Kothuru Murali 2026-05-22 14:36:09 0 114
Andhra Pradesh
వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్...
By Gadiyapudi Narendra 2026-02-20 16:23:27 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com