"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|

0
383

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగా నేడు వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని ఇందిరా నగర్‌లో, ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పాదాచారులు, రోజువారీ కూలీలు మరియు స్థానిక ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం మరియు పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

చలివేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ని ఎమ్మెల్యే అభినందించారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మొహసిన్, విజయ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చోట్ల కొనసాగుతాయని నాయకులు వెల్లడించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ముందస్తుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి...
By Kothuru Murali 2026-04-14 04:04:42 0 230
Telangana
మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష ..
చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60...
By Bonagiri RaviShankar 2026-06-10 07:22:16 0 223
Telangana
మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి -...
By Bheeshman King 2026-05-07 10:10:17 0 1K
Andhra Pradesh
యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి
ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు...
By Boiena Rajesh 2026-03-23 04:22:43 0 255
BMA
Photojournalists on the Frontline: Targets for Truth
Camera operators and photojournalists face unique, high-stakes dangers compared to print...
By JoinBMA 2026-08-19 08:17:11 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com