శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.

0
138

శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు

పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్

అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం

ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్

అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన

శక్తి యాప్, పోలీసుల అప్రమత్తత ఓ యువతిని అర్ధరాత్రి ఆపద నుంచి సురక్షితంగా బయటపడేశాయి. అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ బారి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినిని కాపాడిన మంగళగిరి గ్రామీణ పోలీసులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. మహిళల భద్రతకు టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. నంబూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి బెంగళూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆటో డ్రైవర్ బొమ్మనపల్లి ఫణీంద్రకుమార్ వాహనం వేగాన్ని తగ్గించి, అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతి, వెంటనే తన ఫోన్‌లోని శక్తి యాప్ ద్వారా ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.

 

అలర్ట్ అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు, ఎస్సై వెంకట్ నేతృత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. యాప్ ద్వారా వచ్చిన లైవ్ లొకేషన్ ఆధారంగా ఆటోను కాజా సమీపంలో అడ్డగించి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. యువతిని సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చారు.

 

ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "అర్ధరాత్రి యువతిని కాపాడిన మంగళగిరి పోలీసులకు అభినందనలు. శక్తి యాప్ ద్వారా సమాచారం రాగానే వేగంగా స్పందించి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. సోదరీమణులారా, మీ ఫోన్లలో శక్తి యాప్‌ను తప్పక ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రాణాలను కాపాడుతుంది" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై గుంటూరు డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 203
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 194
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 303
Andhra Pradesh
రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి జయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-02-21 14:57:31 0 587
Andhra Pradesh
వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రివర్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్...
By John Baji 2025-12-23 16:04:42 0 285
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com