కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి

0
198

 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి....

141 వ మేడే ను జయప్రదం చేయండి.

మోడెం మల్లేశం AIFTU( న్యూ ) రాష్ట్ర అధ్యక్షులు 

      నర్సంపేట లోని వ్యవసాయ మార్కెట్లో పనిచేయుచున్న అన్నం రాజు కోర్టు హమాలీ కార్మికులు 25 మంది ఏఐఎఫ్ టి యు న్యూ కార్మిక సంఘంలో చేరిన సందర్భంలో, కార్మిక వర్గ సమస్యలు, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థల ను కాపాడాలని,మోడీ ఫాసిస్టు విధానాలు విడనాడాలని మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నం రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది...

ఈ సందర్భంగా ముఖ్య వక్తగా మొడెం మల్లేశం పాల్గొని మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకుని కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ బోలి జాతి కంపెనీల యజమానులకు అనుగుణంగా లేబర్ కోడులను తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం జరుగుతుంది. ఇది కార్మిక వర్గానికి తీరని నష్టం కార్మిక వర్గం ఎన్నో సంవత్సరముగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాచివేయటం కార్పొరేట్ శక్తులకు దేశ కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం కోరుకుంటుంది...

అతి కొద్ది మంది చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతం అయిందని, దీనితో ఆర్థిక అసమానతలు పెరిగి, ఉద్యోగ, ఉపాది అవకాశాలు లేక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు వత్తాసు పలుకుతూ దేశ సంపదను,ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారధత్తం చేస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ సహకారంతో ఆదాని చట్టాలను ఉల్లంఘించి, రకరకాల దందాలను కొనసాగించి,వేల కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నడని వివరించారు. మోడీ బడ్జెట్ లో సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు కోత విధించారని దీనితో ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం వేష, భాష, ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని, ప్రజాస్వామిక హక్కులను నిరాకరిస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తమ అభిప్రాయాలను వినిపించితే దాడికి పూనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, ఇలాంటి విషపూరితమైన వాతావరణాన్ని కి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు..

 రాష్ట్రంలో బీడీ, హమాలి, భవన నిర్మాణం,గ్రామ పంచాయితీ,మిషన్ భగీరథ, స్కీం వర్కర్లు,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ లకు శ్రమకు తగిన వేతనాలు లేకపోవడంతో వారి బ్రతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. శ్రామికులు సంపద సృష్టికర్తలని వీరికి చట్ట బద్ద హక్కులు కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు కూలీరేట్లను పెంచాలని, అసంఘటిత రంగంలో పనిచేయుచున్న లక్షల మంది కార్మికులకు ఎలాంటి హక్కులు లేక కనీస వేతనాలు లేక నిత్యం కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. కార్మికులు పనిచేసే పరిశ్రమలలో కనీస సౌకర్యాలు లేక అనారోగ్యాలకు గురై పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తమ జీవితాలను బలి పెడుతున్నారు. రాష్ట్రంలో ఫార్మ కంపెనీలను ఇతర భహు లజాతి కంపెనీల పరిశ్రమలను నెలకొల్పుటకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను పక్కకు పెట్టి నియంతృత్వంగా వ్యవహరిస్తూ, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై నిర్బంధాన్ని, అణిచివేతను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికైనను ఇలాంటి తప్పుడు విధానాలకు స్వస్తి పలికి కార్మిక, రైతు ప్రయోజనాల వైపు ఆలోచన చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగినది. మే 1వ తేదీన 141 వ మేడే ను ఘనంగా నిర్వహించాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగినది. ..

ఈ కార్యక్రమంలో మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐఎఫ్టియు (న్యూ) నాయకులు బొల్లెమైనా రమేష్ , ఆముదాల రమేష్ ఓర్సు రాజేందర్ పాకాల మజ్ను నాగరాజు సమ్మయ్య సురేష్ రాములు సదయ్య శ్రీకాంత్ కుమారస్వామి రాజేష్ సునీల్ హనీష్ కుమార్ రవి సురేందర్ లింగన్న ఈ వెంకన్న పట్టా వెంకన్న ఐత కుమార్ మల్సూర్ పున్నం రాజు మూడు లక్ష్మణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

విప్లవాభి వందనాలతో...

కామ్రేడ్ మోడెం మల్లేశం 

ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..
  ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా...
By BABJI DADALA 2026-02-21 12:56:11 0 552
Telangana
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ...
By Nookapangu Manikanta 2026-05-23 11:44:49 0 322
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కృషిని కొనియాడిన MLA లు బోండా ఉమ గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *24-12-2025*   *గ‌తంలో ఏ ఎంపీ ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-25 10:57:47 0 525
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 492
Andhra Pradesh
ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం
*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం*    అమరావతి :   ఏపీలో సముద్రంలో చేపల వేటపై...
By Rajini Kumari 2026-04-13 08:08:17 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com