"అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!

0
362

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. 

అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు నేరానికి వాడిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఈ నెల 21వ తేదీ సాయంత్రం పంచశీల ఎన్క్లేవ్ వద్ద 70 ఏళ్ల వృద్ధురాలు పెద్దిరాజు జానకి దేవి మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుండగా, వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. 

ఈ క్రమంలో గొలుసు తెగిపోవడంతో పాటు వృద్ధురాలి మెడకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరుసటి రోజు మచ్చ బొల్లారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజస్థాన్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి 10 లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

అత్యంత వేగంగా స్పందించి భారీ విలువ గల ప్రాపర్టీని రికవరీ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. వీరబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ జీవన్ కుమార్, కానిస్టేబుల్ రమాకాంత్ మరియు మహిళా కానిస్టేబుల్ యోగితా సింగ్‌లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. 

ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఈ సందర్భంగా సూచించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో భారీగా మత్తు పదార్థాలు సీజ్
ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో గురువారం 'ఆపరేషన్...
By Kothuru Murali 2026-02-27 04:07:25 0 180
Telangana
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు...
By Gujile Ramu 2026-05-01 07:08:24 0 393
Andhra Pradesh
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...
By Boiena Rajesh 2026-02-25 06:25:27 0 456
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 2K
Andhra Pradesh
Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.
మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని...
By Pagadala Venkateswar 2026-09-18 06:10:56 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com