నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
195

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!

మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనం.

ఈ నెల 17 వ తేదీన బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టిన వంట నిర్వహకులు.

బల్లి పడిందని విద్యార్థులు చెప్పితే తినండి ఏమి కాదులే అంటూ నవ్విన వంట సిబ్బంది.

తల్లిదండ్రులకు చెపితే టీసీలు ఇస్తామంటూ విద్యార్థులకు బెదిరింపులు?

బల్లి కాదు,మిడత అంటున్న ప్రిన్సిపల్ !

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, వంట సిబ్బంది చలగాటమాడుతున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తెలిపారు.17 వ తేదీన జరిగిన పరిస్థితిని బయటకు రాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని, ఎండాకాలం సెలవులు సందర్భంగా ఈరోజు బయటికి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి తమ పరిస్థితిని వివరించారని తెలిపారు. ఉన్నత అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పైన, వంట సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంవలన 200 మంది విద్యార్తులు విష ఆహరం తిన్నతరువాత వాంతులు చేసుకొవడం జరిగింది. ఎంతో గౌరవంతో హాస్టల్ మీద నమ్మకంతో పేద కుటుంభంనుండి వచ్చిన విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించక అభద్రతా భావంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్ధులు చాలా అవస్తలు పడుచున్నారు. విష ఆహరం వలన విద్యార్థులకు ఎదయినా జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఒక బాధ్యతాయుత అధికారిగా ఉండి విద్యార్థుల విషయంలొ ప్రతి విషయంలోను నిర్లక్ష్యంచేస్తూ విద్యార్ధులపాలిట శాపంగా మారిన కేజీబీవీ ప్రిన్సిపల్ మీద శాఖాపరమైన విచారణ చేసి తక్షణమే విధులనుండి సస్పండ్ చెయ్యాలని ఈ విషయంపై రాబొయే సొమవారం బిజెపి జనతా వారిది PGRS కార్యక్రమంలో తగిన ఆధారాలతో జిల్లా కలెక్టరు గారికి పిర్యాదుచేస్తామని తెలిపారు. 

ప్రిన్సిపల్ గారికి ఈ విషయంపై అరా తియ్యగా ఆ రోజు పడింది బల్లి కాదు, మిడత అంటూ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు మాత్రం మిడత కాదు బల్లి పడిందని ఫోను ద్వారా తమకు తెలిపారన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-03-09 06:06:41 0 171
Assam
Assam Advances Urban Development and Smart Cities
Assam is accelerating urban development through Smart City initiatives aimed at improving...
By Fathima Safa 2026-07-01 05:46:17 0 150
Andhra Pradesh
ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి...
By Benguluri Madhubabu 2026-04-02 06:18:54 0 245
Andhra Pradesh
Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.
      Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం...
By Pagadala Venkateswar 2026-03-13 08:01:03 0 233
Telangana
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్...
By G k Nookala 2026-04-13 15:48:58 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com