కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు

0
283

నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో గ్రామస్థులు బుధవారం ఆందోళన చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం వద్ద మహిళలు ఖాళీ బిందెల తో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామంలో వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదన్నారు. జలజీవన్ మిషన్ పధకం పనులు అసంపూర్తిగా వున్నాయని, గ్రామానికి వచ్చే ప్రధాన పైపు లైన్లు పగిలిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అక్రమ మెాటారు మంచి నీటి కనెక్షన్ లు తొలగించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు కర్రి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కమ్మవారిపాలెం గ్రామంలో తక్షణమే మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా మంచి నీరు రాక దాహార్తి తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ారని, ట్యాంక్ ల ద్వారా మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కమ్మవారిపాలెం గ్రామ సిపిఎం నాయకులు పత్తి పాటి శ్రీనివాసరావు,చెరుకుపల్లి రమేష్, సుబ్బారావు, శ్రీనివాసరావు, శ్రీరామనేని స్వామి, మంచి దనమ్మ, ఏలూరు సామాజ్ర్యం, చండ్ర దుర్గ, రాగి స్వామి, నాగలక్ష్మి, జగిని, గౌసియా నాయక్, గోపి నాయిక్, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 185
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 151
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*  ...
By Rajini Kumari 2025-12-18 09:54:48 0 250
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:59 1 357
Telangana
కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన...
By Sunka Santhosh 2026-06-10 18:00:10 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com