జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి

0
165

జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ టిక్కెట్ ఇస్తిమీ.. అయినా నువ్వు ఓడిపోతే మా తప్పా..? - సీఎం రేవంత్ రెడ్డి 

‎అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు.

‎కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డిపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. 14సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాలదన్ని పాపాల భైరవుడి చెంత చేరారని జీవన్‌రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు. నీ దరిద్రంతో నువ్వు ఓడిపోతే పార్టీ ఏం చేస్తుందన్నారు. ఓడిపోయిన నీకు మంత్రి పదవి ఎందుకు వస్తుందన్నారు. పదవిలేకుండా కనీసం ఒక్క ఏడాది కూడా ఉండలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ప్రజాపాలన చేస్తున్న తమను కాదని పాపాల భైరవుడు లాంటి కేసీఆర్ రావాలా అని జీవన్‌రెడ్డిని నిలదీశారు.

‎ప్రజాపాలన పోయి.. పాపాత్ముడి పాలన రావాలని జీవన్‌రెడ్డి కోరుకుంటున్నారని.. ఆయనకు పదవి పోయిందని.. ప్రజలకు మేలుచేస్తున్న ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారంటూ కాంగ్రెస్‌ను వీడిన జీవన్‌రెడ్డిపై రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. . బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అక్రమాలను ఎత్తిచూపుతూ జీవన్‌రెడ్డికి ప్రశ్నలు వేశారు. మొదటి సారి టికెట్ తీసుకున్న వారు కూడా మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. మరి మొనగాడైన జీవన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.

‎అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు

‎జీవన్ రెడ్డి లాంటి కర్కోటక నాయకుడిని తాను చూడలేదని తెలంగాన సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి వల్ల ప్రజా ప్రభుత్వం రాలేదని, జగిత్యాలలో ఓడినా ఆయనను గౌరవించామని పేర్కొన్నారు. మంత్రి పదవి రాలేదన్న సాకుతో శత్రువులతో చేతులు కలిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు 40 ఏళ్లుగా సేవ చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం పోవాలని కోరుకోవడం స్వార్థమేనని రేవంత్ విమర్శించారు. పదవి రాకుంటే ప్రభుత్వం పోవాలని కోరుకుంటావా అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

‎వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో ఘోరి కట్టామని అన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 279
Andhra Pradesh
కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి...
By Benguluri Madhubabu 2026-05-16 11:45:53 0 252
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-31 05:19:33 0 202
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 103
Uttar Pradesh
UP Strengthens Environment Conservation and Green Drive
Uttar Pradesh continues to advance environmental conservation in 2026 through large-scale...
By Fathima Safa 2026-07-04 11:28:23 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com