నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం

0
582

నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం:

మున్సిపల్ కమిషనర్ లోవరాజు

నందిగామ, ఎన్టీఆర్ జిల్లా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర" (SASA) ప్రతినెల 3వ శనివారం కార్యక్రమములో ఏప్రిల్ నెలకు సంబంధించి "జలధార జలహారతి" కార్యక్రమమును మునిసిపల్ కమిషనర్ జి.లోవరాజు గారు నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయములో మరియు జయ సిద్ధార్ధ స్కూల్ ఆవరణలో భూగర్భ జలాల మెరుగు కొరకు ఇంకుడు గుంతలను తవ్వించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీటి వనరుల పరిసరాలను శుభ్రపరిచే పనులు చేపట్టడంతో పాటు, భూగర్భ జలాల నిల్వ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి అనుగుణంగా నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వ విధానాలను అమలు చేయడం, నీటి వృథాను నివారించడం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంపొందించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, పురపాలక సంఘ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది "SASA "ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమములో శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్  మరియు కార్యాలయ సిబ్బంది. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బంగారు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ...
By Kothuru Murali 2026-05-13 18:53:39 0 146
Andhra Pradesh
నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు...
By Boya Dasthagiri 2026-04-02 11:14:35 0 326
SURAKSHA
B. Lakshmi Kantham, IAS: Championing Good Governance Excellence
B. Lakshmi Kantham, IAS: A Distinguished Civil Servant Committed to Transforming Governance A...
By Lokeshwari Panthadi 2026-07-13 13:33:39 0 387
SURAKSHA
Shivdeep Lande: The Fearless IPS Officer Who Inspired Bihar
The Journey Begins "The uniform is not a symbol of power—it is a promise to protect the...
By Fathima Safa 2026-08-03 07:02:47 0 454
Andhra Pradesh
నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:17:36 0 526
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com