నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు

0
524

చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఒక ట్రాక్టర్ ట్రాలీ నిండుగా, ఎటువంటి రక్షణ కవచం తార్పాలిన్ వంటివి లేకుండా మట్టి, రాళ్లను తరలిస్తూ కనిపించింది. ట్రాలీలో మట్టిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల, ప్రయాణంలో ఆ మట్టి రోడ్డుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గాలికి మట్టి రేణువులు ఎగిరి వాహనదారుల కళ్లలో పడటంతో తృటిలో ప్రమాదాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి వాహనాలు వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా, పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే ఇలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ట్రాక్టర్ లోడు పై ఖచ్చితంగా వెనక డోర్లు ,కవర్లు ఉండేలా చూడాలని స్థానికులు కోరారు .

Search
Categories
Read More
Telangana
నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి...
By Ponnala Srinivasrao 2026-05-25 02:34:26 0 157
SURAKSHA
దిశ యాప్: మహిళలకు కొండంత అండ
మహిళల అత్యవసర రక్షణ కోసం రూపొందించబడిన 'దిశ యాప్' (Disha App) ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా...
By Kalaga Sailaja 2026-06-26 06:56:29 0 117
Andhra Pradesh
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్ష
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్షVER మాస్టర్‌ప్లాన్‌ అజెండాపై...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:36:10 0 323
Andhra Pradesh
మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు
విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న...
By Boiena Rajesh 2026-04-29 03:27:23 0 258
Telangana
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-01-26 12:37:20 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com