అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.

0
143

 

అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

18-04-2026 Sat 07:23 | Andhra

Sajjala Bhargav Reddy Case High Court Outraged by Defamatory Posts

వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం

అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు

సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న

షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం

నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని 'ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన'గా అభివర్ణించింది. ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.

 

తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలని కోరుతూ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని ధర్మాసనం గుర్తు చేసింది.

 

ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని భార్గవ్ రెడ్డిని ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

 

ఈ షరతులకు లోబడి భార్గవ్ రెడ్డిపై ఉన్న ఎల్‌ఓసీని రీకాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు అభ్యర్థన అందిన వెంటనే ఎల్‌ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Search
Categories
Read More
Kerala
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...
By Fathima Safa 2026-06-17 11:23:31 0 203
Telangana
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి  ‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి...
By Ponnala Srinivasrao 2026-07-10 01:52:26 0 194
Andhra Pradesh
పుంగనూరు: సర్ ప్రక్రియను పారదర్శకతతో చేయాలి: డిఆర్ఓ
అన్నమయ్య డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని...
By Kothuru Murali 2026-06-11 12:51:50 0 123
Andhra Pradesh
*చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా...
By Vadlamudi NagaVenkat 2026-03-06 11:27:29 0 547
Andhra Pradesh
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
By Pagadala Venkateswar 2026-01-13 07:38:02 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com