ఎస్సై కి ఆహ్వానం పలికిన హనుమాన్ స్వాములు

0
908

​కొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ​ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. అలాగే ​ఏప్రిల్ 22న మండలకేంద్రంలో పురవీధుల్లో హనుమాన్ నగర సంకీర్తన నిర్వహించనున్నారు. భక్తుల కోలాహలం, భజన కీర్తనలతో ఈ కార్యక్రమం కనువిందుగా సాగనుంది.​ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, హనుమాన్ సేవా సమితి ప్రతినిధులు మరియు హనుమాన్ మాలధారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సైని కలిసి కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

​"భక్తిభావంతో నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని" నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపురపు బిక్షపతి, కల్లూరి కృష్ణ చారి, నాగబేల్లి శోభన్ గట్ల శ్రీను, గూడూరు దుర్గాప్రసాద్, ప్రశాంత్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశం
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు మరియు...
By Chennaiah Kati 2026-06-18 08:19:41 0 122
Andhra Pradesh
పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం.
మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-07-09 04:49:28 0 109
Telangana
విద్యుత్ శాఖలో అన్మాండ్ అనే విద్యుత్ ఉద్యోగి మృతి...
నర్సంపేట: విద్యుత్ షాక్తో యువకుడి మృతి భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని...
By Gujile Ramu 2026-08-12 10:31:49 0 173
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|
హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-03-28 07:21:58 0 209
Andhra Pradesh
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్ వార్నింగ్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్...
By Chennaiah Kati 2026-07-05 14:27:06 1 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com