జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.

0
243

చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ కోరారు. చింతూరు ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న ఆలస్యం కారణంగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.               ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మరియు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి...
By John Baji 2026-01-02 14:16:22 0 233
Goa
Goa Strengthens Coastal Protection and Conservation Efforts
Goa continues to prioritize coastal protection and environmental conservation as rising sea...
By Fathima Safa 2026-06-25 12:37:53 0 209
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 228
Andhra Pradesh
Foogy river
పైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ.. ఎముకలు కొరికే చలిలో భక్తుల పుణ్యస్నానాలు   Foggy River...
By Siva Bhaskar 2025-12-24 08:58:47 0 833
Rajasthan
Rajasthan Strengthens Law and Order Through Reforms
Rajasthan continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 04:36:35 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com