టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

0
188

*టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ శ్రేణుల సంబరాలు, పార్టీకి నూతన ఉత్సాహం*

 

 

మంగళగిరి, ఏప్రిల్ 15 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ప్రకటించగా, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నియమితులైన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు.మంగళగిరి టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని,యువ నాయకత్వానికి ఇది పెద్ద గుర్తింపని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, నారా లోకేష్‌ కు లభించిన ఈ పదవి ఆయన కృషికి గుర్తింపని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ యువతను ఆకర్షిస్తున్న నారా లోకేష్ భవిష్యత్‌లో మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ, టీడీపీకి ఇది కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Pink Hoysala: Dedicated Patrol Vehicles Ensuring Women's Safety
The Pink Hoysala is a specialized initiative by the police department focused entirely on...
By Kalaga Sailaja 2026-06-26 11:04:59 0 113
Andhra Pradesh
మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-07-01 07:01:20 0 104
Telangana
Hyderabad Startup Ecosystem Emerges as India Innovation Hub
Hyderabad has rapidly evolved into one of India’s leading startup ecosystems, driven by...
By Fathima Safa 2026-06-29 11:58:37 0 206
Andhra Pradesh
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-17 10:44:44 0 215
Andhra Pradesh
పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు...
By Kothuru Murali 2026-03-14 08:24:39 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com