అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి

0
250

 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే  పిలుపు

బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం.

బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం మరియు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారు. 

ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. 

అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ ప్రస్తుతానికీ మార్గదర్శకాలు. 

యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీ దావ స్వాతి రమేష్ బాబు గారు, వైస్ చైర్మన్ రగంశెట్టి సత్యనారాయణ గారు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మూచర్ల మల్లయ్య , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ...
By Manda Ramkumar 2026-03-28 13:22:07 0 631
Telangana
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-31 09:46:33 0 726
SURAKSHA
Dinesh Kumar A. S., IAS: Driving Public Innovation
A Dynamic IAS Officer Advancing Administrative Excellence, Digital Transformation, and...
By Lokeshwari Panthadi 2026-07-11 13:00:22 0 383
Andhra Pradesh
కల్లూరు ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ట్రాక్టర్
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ఘాట్ రోడ్డులో మామిడికాయల లోడుతో...
By Kothuru Murali 2026-06-25 17:39:38 0 147
Telangana
అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్...
By Chunarkar Jagadeesh 2026-09-15 13:37:59 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com