"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|

0
1K

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అంశమని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అధిక వేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణతోనే ప్రాణ నష్టాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని, డ్రైవర్లు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా స్కూల్ జోన్‌లలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.

కార్యక్రమం చివరలో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రజలతో రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

👉 జాగ్రత్తగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా గమ్యం చేరండి!

#Sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Madhya Pradesh
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
By Lokeshwari Panthadi 2026-06-27 08:05:47 0 83
Andhra Pradesh
విద్యార్థి సంఘాల నాయకులను అవమానించిన గోనెగండ్ల ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ సస్పెండ్ చేయాలి డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు
విద్యార్థి సంఘాల నాయకులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి,కులంతో అవమాన పరిచిన ZPHS గోనెగండ్ల ఫిజికల్...
By Boya Dasthagiri 2026-06-18 16:06:55 0 186
Andhra Pradesh
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు...
By Chennaiah Kati 2026-06-28 13:24:58 0 104
Andhra Pradesh
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమంcpm పోలీస్ బ్యూరో సభ్యులుBV రాఘవులు
ఈరోజు (20 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2025-12-20 13:14:35 0 214
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత   గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల...
By Pinnehasan Odela 2026-03-09 16:59:40 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com