ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.

0
196

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీలోకంలో విషాదం నెలకొంది.

 

లక్ష్మీనరసింహారావు సాంఘిక శాస్త్ర, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో నిబద్ధత కలిగిన ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా పద్య కవిగా సాహితీ సేవ చేస్తూ వందలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్థాపించిన 'పద్య సారస్వత పరిషత్' ద్వారా ఎంతోమంది యువకులను పద్య కవులుగా తీర్చిదిద్దారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిషత్ శాఖలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. పద్య సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 'పద్యభారతి' అనే బిరుదు లభించింది.

 

ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన, ఒంగోలులోని శ్రీపశుపతీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి లక్షల రూపాయల విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అర్ధాంగి మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లక్ష్మీనరసింహారావు అంత్యక్రియలు నేడు (సోమవారం) నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Food Security Through Public Distribution
Tamil Nadu continues to reinforce its Public Distribution System (PDS) to ensure food security...
By Fathima Safa 2026-06-29 10:38:47 0 73
Telangana
వాన దేవుడా మమ్మల్ని కరుణించు రాజాపేట మహిళలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో...
By Pindikura Mahesh 2026-06-28 09:57:21 0 595
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Andhra Pradesh
ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.
పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన...
By Pagadala Venkateswar 2026-05-02 04:18:22 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com