శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF

0
1K

మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ అందజేసిన అనంతరం మాట్లాడుతూ,ఉపాధ్యాయులకు తక్షణమే నగదు రహిత హెల్త్ కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే డిటిఎఫ్ శ్రేణులు కుంజ శ్రీనివాస్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చాట్ల పొట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శులు తేజ్ మేలాల్, చార్టర్ నాగేశ్వరరావు, గంగారం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి లక్కాకుల రమేష్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు దశరథ్ కుమార్, కోటి, వాసం ప్రభాకర్, వాసం ప్రమీల, దన్సరి లక్ష్మణ్, బానోత్ వెంకన్న తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Manish Kumar Gupta IAS: Leading Arunachal with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer, Manish Kumar Gupta brings over three decades...
By Lokeshwari Panthadi 2026-08-03 05:16:43 0 226
Tamilnadu
Tamil Nadu Expands Governance and Digital Services
Description:Tamil Nadu is advancing governance through expanded digital public services,...
By Fathima Safa 2026-07-02 07:28:31 0 89
SURAKSHA
Kento Danggen IAS: Driving Labour Reforms With Vision
A senior Arunachal Pradesh administrator, Kento Danggen is leading the Labour & Employment...
By Lokeshwari Panthadi 2026-08-03 07:39:38 0 250
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 194
Telangana
తెలంగాణ పోలీస్ బాస్ సీవీ ఆనంద్
రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి, తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్, ఆయన భార్య లలితా...
By Ponnala Srinivasrao 2026-04-29 06:18:30 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com