ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు

0
2K

n  నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకుఇప్పపువ్వు

n  గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం

n  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్..

nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య

 మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను కూడా లెక్క చేయకుండా చెట్టు చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్పపువ్వును అమ్మి జీవనం సాగిస్తారు. ఆకలేస్తే ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. అడవి నుండి తమ ఆహారపు అవసరాలు తీర్చుకోగలిగిన కాలంలో కామధేనువులా, కల్పతరువులా నిలిచిన వృక్షం ఇప్పచెట్టు. ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు, పూజా పురస్కారాల్లో, పండుగలు పబ్బాల్లో ఇప్ప చెట్టుకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. అయితే ఇప్పచెట్టు,ఇప్పపువ్వుతో ఆదివాసీలకు ఉన్న ఉపయోగాలు, ప్రయోజనాలు ఇన్నని చెప్పలేము. అయితే అసెంబ్లీలో ఇప్పపువ్వు, దాని ప్రొడక్ట్స్ గురించి ఎమ్మెల్యే అనిరుధ్ చెప్పిన మాటలు. ఇది సారా మాత్రమే కాదు.. అంతకు మించి అన్న చర్చ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్ప పువ్వు ప్రొడక్ట్స్ పై అంతటా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు అడవిలో రాలిపోయి, కేవలం సారా తయారీకే పరిమితమైన ఇప్ప పువ్వు.. ఇవాళ ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ఎదుగుతోంది. అడవి తల్లి అందించిన అక్షయ పాత్ర. గిరిజనుల పాలిట కల్పవృక్షమిది.

 నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకుఇప్పపువ్వు

 ఆదివాసీల ఆచార, ఆహార, ఆర్ధిక వ్యవస్థతో పెనవేసుకున్న జీవనాధారం ఇప్పపువ్వు. అందుకే ఇప్ప చెట్టును కల్పవృక్షంగా ఆరాధిస్తారు ఆదివాసీలు. ఎండాకాలం మొదలైందంటే చాలు కోయ గూడాలలో ఇప్పపువ్వు సేకరణ పండగ మొదలవుతుంది. ఆదివాసీలకు, మార్చి ఏప్రిల్ నెలలో జీవనాధారంగా మారింది ఇప్పు సేకరణ. గిరిజనులు వాడుకోవడం కోసమే కాకుండా, ఆర్థికంగా బలపడేందుకు ఇప్పపువ్వు సేకరణ పనికొస్తుంది. ఒకప్పుడు కేవలం నాటు సారాకే పరిమితమైన ఇప్ప పువ్వు, ఇప్పుడు సూపర్ ఫుడ్ గా రికార్డులు సృష్టిస్తోంది. ప్యూర్, నేచురల్, ఘాటైన అనుభూతిని ఇచ్చే ఈ పానీయం, ఒకప్పుడు గిరిజన వేడుకలకు పరిమితం. కానీ ఇప్పుడు ఆర్గానిక్ డ్రింక్స్‌ను ఇష్టపడే వారికి ఇదో ఆల్టర్నేట్ గా మారింది. కొన్ని ప్రాంతాల్లో మహువా చెట్టుగా పిలుచుకునే ఇప్ప పూల సేకరణ కోసం ఇంటిల్లిపాది తెల్లవారుజామునే అడవి బాట పడుతుంటారు.

 ఇప్ప పువ్వు గ్లోబల్ ట్రెండ్!

 ఇప్ప పువ్వును మరగబెట్టి చేసే మహువా టీ కూడా ట్రెండింగ్ అవుతోంది. చక్కెర అవసరం లేని సహజ సిద్ధమైన స్వీట్ నెస్ దీని స్పెషల్. అలాగే ఇప్ప పువ్వు సిరప్‌ను పాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్ మీద టాపింగ్‌గా వాడుతున్నారు. అడవి పువ్వుకు లభించిన గ్లోబల్ టచ్ ఇది. ఇప్ప పువ్వు పొడితో చేసే గారెలు, రొట్టెలు గిరిజనుల ఇష్టమైన భోజనం. ఇప్పుడు బిస్కెట్లు, కుక్కీస్ గా మారుతున్నాయ్. గ్లూటెన్ లేని ఫుడ్ కావాలనుకునే వారికి ఇప్ప పిండి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. చెప్పాలంటే ఇప్ప పువ్వు ఓ పోషకాల గని.

 గ్లూటెన్ ఫ్రీ డైట్‌లో కొత్త స్టార్

 గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాలలో సహజంగా ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది పిండికి జిగురును ఇస్తుంది. అయితే కొందరికి గ్లూటెన్ తింటే చిన్న ప్రేగులు దెబ్బతింటాయి. కొందరికి గ్లూటెన్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియ బాగుండాలనుకునే వారు కూడా ఇప్పుడు గ్లూటెన్ లేని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సాధారణంగా గ్లూటెన్ లేని ఆహారం కోసం జొన్నలు, సజ్జలు లేదా రాగులు వాడుతుంటారు. ఈ లిస్టులో ఇప్పుడు ఇప్ప పిండి కూడా వచ్చి చేరింది. పైగా గోధుమ పిండిలో కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే, ఇప్ప పిండిలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి, రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఆప్షన్. ఆదివాసులు సేకరించిన ఇప్ప పూలలో అత్యధిక శాతం సారా తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పపూలను ఆరబెట్టి, ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా మద్యం తయారీ చేస్తారు. ఇప్ప ఉత్పత్తులను సంవత్సరం పొడవునా ఆహార పదార్ధంగా వినియోగిస్తారు. లడ్డూలు, రొట్టెలు, నూనెలుగా అటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం, ఇప్పనూనెతో చర్మం, జుట్టు సంరక్షణ ఒక్కటేమిటి అన్నీ స్పెషల్సే అంటున్నారు. ఇప్ప సారా నుంచి పోషకాలు అందించే ఇప్ప లడ్డూల తయారీ దాకా కాలం చాలా మారింది. ఇప్పపూలతో నాటు సారా తయారుచేసే గిరిజనులు, ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో గిరిజన మహిళ రక్తహీనతను తగ్గించేందుకు ఇప్పపువ్వుతో లడ్డులను తయారు చేస్తున్నారు.

 గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం

 ఉమ్మడి ఏజన్సీ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో గర్భిణులకు ఈ ఇప్పపువ్వు లడ్డూలను స్వీకరిస్తారు.ఇప్పపువ్వుతో వినూత్న వంటలు

సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారని, రకరకాల వంటలు చేస్తున్నారని వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటున్నారని.. వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం కమ్మదనం కనిపిస్తుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.

 ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్..

 తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని వన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్ లో ఆదివాసి ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని ఇప్పటికే నడిపిస్తున్నారు. వేసవిలో లభించే ఈ ఇప్పపువ్వులను ఆదివాసి మహిళలు వేకువజామున వెదురుబుట్టలలో సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి ఈ ఇప్ప పూలతో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు. ఇప్పపువ్వు ప్రొడక్ట్స్ అంటే సారా మాత్రమే కాదు.. దీన్ని పక్కన పెడితే ఇప్ప లడ్డూల వంటివి, ఇప్ప పిండి ఇలాంటివి శరీరానికి ఎంతో మేలని, వీటితో కండరాలు బలంగా ఉండడంతో పాటు మోకాళ్ల నొప్పులు తగ్గడం, రక్తహీనతకు చెక్ పెట్టడం వంటివి ఇక్రిశాట్ పరిశోధనలో వెల్లడైందని పుల్సమ్ సాంబయ్య అన్నారు. ఇప్ప పువ్వు అనగానే నెగెటివ్ ఇంపాక్ట్ వైపు చూడొద్దని,సారాను ఎవరూ ప్రోత్సహించరు. ప్రోత్సహించొద్దు కూడా. అయితే అదే సమయంలో ఇప్ప ప్రొడక్టులతో కలిగే లాభాలనూ గుర్తించాలని, రాబోయే రోజుల్లో ఇప్ప ఉత్పత్తులను పెంపొందించాలని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హాల్ టికెట్ చూపించి ఉచితంగా...
By Pagadala Venkateswar 2026-03-06 03:51:09 0 151
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Andhra Pradesh
మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-31 03:41:14 0 150
Andhra Pradesh
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
  ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా...
By BABJI DADALA 2026-01-12 14:50:58 0 591
Andhra Pradesh
International women's day
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By G k Nookala 2026-03-08 12:05:35 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com