"ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !

0
427

హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది.

లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల సాయుధ శక్తి పూర్తిగా క్షీణించిందని, PLGA కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ స్టేట్ కమిటీ (TSC) కూడా ఇక ప్రభావం చూపలేని స్థితికి చేరిందని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతుండటం గమనించదగ్గ విషయం. ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ మరియు పునరావాస విధానాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనతో తెలంగాణలో ఎక్స్‌ట్రీమిజం దాదాపు అంతిమ దశకు చేరుకుందని, మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు.

#sidhumaroju

Alwal 

 

 

Search
Categories
Read More
Telangana
సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని...
By Sidhu Maroju 2026-03-04 15:06:24 0 197
SURAKSHA
Tojo Karga IPS: Leading Progressive Prison Reforms
A distinguished 2007-batch IPS officer of the AGMUT Cadre, Tojo Karga is serving as Inspector...
By Lokeshwari Panthadi 2026-08-03 08:24:28 0 238
Andhra Pradesh
గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే "రెండు లక్షలు" జరిమానా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను...
By Shyamala Yadagiri 2026-05-14 06:10:42 0 211
Telangana
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
By Sidhu Maroju 2026-05-03 15:00:05 0 519
Telangana
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత...
భారత్ అవాజ్ న్యూస్: 31 జూలై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట...
By Gujile Ramu 2026-07-31 00:07:13 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com