పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటకు మహర్దశ

0
164

10.04.26 ప్రచురుణార్ధం 

 

                                                                      *పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేట*

                                                      *రాజధాని అమరావతి ప్రాంతంలోని జగ్గయ్యపేటకు మహార్దశ*

                                                     *రెండేళ్లలో జగ్గయ్యపేట అభివృద్ధి పరంగా రూపురేఖలు మారిపోనున్నాయి*

 

*జగ్గయ్యపేటలో రూ.7.15 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)*

 

 *జగ్గయ్యపేట* : రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత వచ్చిన శుభ సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాకు అన్ని శుభాలే జరుగుతున్నాయని, రాజధాని అమరావతి ప్రాంతంలోని జగ్గయ్యపేటకు మహార్ధశ పట్టబోతోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. రానున్న రెండేళ్లలో అభివృద్ధి పరంగా జగ్గయ్యపేట రూపురేఖలే మారిపోనున్నాయని, పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేట పట్టణం అవుతుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. 

 

జగ్గయ్యపేట కోడాద రోడ్డులో విజయ డిజిటల్ దగ్గర మున్సిపాలిటీ డీఎంఎఫ్‌టి నిధులు రూ.7.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, ఇతర అభివృద్ధి పనులకు సంభంధించిన డీఎంఎఫ్‌టి గ్రాంట్ పైలాన్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర నాయకులతో కలసి అభివృద్ధి పనుల పైలాన్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎంపీ చిన్ని ఆవిష్కరించారు. 

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ..... రాజధాని ప్రాంతం హద్దులు తెలియని అజ్ఞానులు వైసిపి నాయకులు అన్నారు. జగ్గయ్యపేట పట్టణం రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమే అని, పార్లమెంటులో జరిగిన అమరావతి చట్టబద్దత బిల్లులో కూడా ఏఏ ప్రాంతాలు అమరావతి రాజధాని పరిధిలోకి వస్తాయో వివరంగా ఉందని ఆ విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. 

 

అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలంటే జగ్గయ్యపేట , నందిగామ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. జగ్గయ్యపేట రాజధాని ప్రాంతంలో ఒక ముఖ్యమైన భాగం అన్నారు. 40 ఏళ్ల చరిత్రలో జగ్గయ్యపేటలో ఏనాడు లేని విధంగా ప్రస్తుత మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో అభివృద్ధి చర వేగంగా జరుగుతుందన్నారు. ఆ క్రమంలోనే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుండి రూ.7.15 కోట్ల నిధులతో జగ్గయ్యపేటలో వివిధ రోడ్లు మరియు డ్రైన్ల పనులు, కల్వర్టుల నిర్మాణంకు ప్రస్తుతం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 

 

రానున్న కాలంలో జగ్గయ్యపేటను ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటను చేసేందుకు 1400 ఎకరాల స్థలం అవసరమని, దీనిపై ఇండస్ట్రియల్ సెక్రటరీతో చర్చలు జరుపుతున్నట్లు ఎంపీ తెలిపారు. డిఫెన్స్ పరిశ్రమల కోసం 1000 ఎకరాలు, జేఆర్డీ టాటా వాటర్ కోసం 500 ఎకరాల స్థలం కావాల్సి ఉందన్నారు. 40 సంవత్సరాల నాటి డంప్ యార్డు పరిష్కరించడం జరిగిందని, త్వరలోనే మంచినీటి సమస్య పరిష్కారంకు సైతం పనులు ప్రారంభిస్తామని వివరించారు. జగ్గయ్యపేట పరిధిలో నేషనల్ హైవే పనులు , సెకండ్ లైన్ రైల్వే పనులు పూర్తవుతున్నాయన్నారు. జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌కు ప్యాసింజర్ రైళ్లు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. 

 

జగ్గయ్యపేట ’స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా పదోన్నతి పొందడం ఈ ప్రాంత అభివృద్ధిలో ముందడుగు అని ఎంపీ చిన్ని చెప్పారు. అప్‌గ్రేడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ నిధులు , 16వ ప్లానింగ్ సంఘం ఫండ్స్‌ను ఉపయోగించుకునే అవకాశం కలిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో జగ్గయ్యపేటలోని ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. 

 

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ , మున్సిపల్ ఛైర్మన్, పాలక వర్గం అందరిని కలుపుకుని రాబోయే 40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా జగ్గయ్యపేటను మూడు రెట్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని ఎంపీ శివనాధ్ (చిన్ని) తెలిపారు. 

 

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కేవలం పట్టణాలే కాకుండా, రాష్ట్రానికి తలమానికమైన అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు . కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకువచ్చి, ఏపీని దేశంలోనే నంబర్ వన్ స్టేట్ గా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

 

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)మాట్లాడుతూ జగ్గయ్యపేట ప్రజల చిరకాల కోరికలను నెరవేరుస్తూ, పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూ. 7.15 కోట్లు వెచ్చించడం ఆనందంగా ఉందన్నారు . గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు . ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటమే మా లక్ష్యం అని తెలియజేశారు.

 

కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ...రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని , ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య నాయకత్వంలో పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు.

 

మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే మా ప్రాధాన్యత అని ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరి నేతృత్వంలో త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ వేడుకలు కూడా వారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుపుతామని తెలియజేశారు. అలాగే పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న కౌన్సిల్ సభ్యులకు జగ్గయ్యపేట పట్టణ ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ మాట్లాడుతూ...ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న జగ్గయ్యపేట, ఈరోజు విజయవాడకు సాటిగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటానికి ప్రధాన కారణం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) , ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) , అలాగే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం కృషి ,దూరదృష్టి నాయకత్వమే అని పేర్కొన్నారు. అందరి సమిష్టి నాయకత్వంలో జగ్గయ్యపేట ప్రాంతం అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తోందని, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా యువతకు కొత్త ఆశలు కలుగుతున్నాయని తెలిపారు. ఇకపై మన పిల్లలు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన రాష్ట్రంలోనే, జగ్గయ్యపేటలోనే మంచి ఉద్యోగ అవకాశాలు పొందే స్థితి ఏర్పడుతోందని హర్షం వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీటీవీ కృష్ణారావు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్ చినబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుబ్బారావు, నూకల కుమార్ రాజా, కట్టా వెంకట నరసింహారావు, మైనేని రాధా, ధూళిపాళ్ల లక్ష్మణరావు, అక్బర్ , మున్సిపల్ కౌన్సిలర్‌లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి...
By Sidhu Maroju 2026-02-27 09:10:42 0 215
Andhra Pradesh
దళితుల కు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఐ టీ డి ఎ, పి ఓ కు వినతి :చింతూరు
చింతూరులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని చింతూరు బి ఆర్ అంబేద్కర్ దళిత సంఘ నాయకులు ఐ టి డి ఎ...
By Shyamala Yadagiri 2026-09-15 17:11:29 0 91
Assam
ASDMA Spearheads Relief Efforts Amid Assam Crisis
The Assam State Disaster Management Authority (ASDMA) is currently leading critical humanitarian...
By Lokeshwari Panthadi 2026-07-01 10:56:47 0 154
Andhra Pradesh
ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా...
By Manda Ramkumar 2026-03-28 09:23:46 0 549
Telangana
Grand Sankranthi celebration at Evergreen school
Sankranti celebrations were organized in Evergreen High School in Nelakondapally mandal of...
By Krishna Balina 2026-01-11 04:07:09 0 453
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com