అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం

0
233

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి


హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ: 10 ఏప్రిల్ 2026
అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, వారి సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సేవలను స్మార్ట్ ఫోన్ల ద్వారా సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు.
అంగన్వాడీ టీచర్లపై ఉన్న పనిభారాన్ని గుర్తించిన ప్రభుత్వం, త్వరలో వారికి శుభవార్త అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన అంగన్వాడీ టీచర్లకు డబుల్ బెడ్‌రూమ్ గృహాలు లేదా స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు శాసనమండలి సభ్యులు, సంబంధిత మంత్రులు, మేయర్లతో చర్చించి కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధులుగా పనిచేస్తున్నారని అన్నారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే స్మార్ట్ ఫోన్లను అందజేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ, చిన్నారులకు ఆరోగ్యం, విద్య, క్రమశిక్షణ వంటి విలువలను నేర్పించే బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందని చెప్పారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేట్ ప్లే స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలతో బోధన సాగించాలని, ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు బోధించిన విషయాలను సులభంగా గ్రహిస్తారని తెలిపారు. బోధనతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అక్షయపాత్ర ద్వారా అందిస్తున్నామని చెప్పారు. చిన్నారులను చదువుతో పాటు ఆటలలోనూ పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.
సమావేశం అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే, మేయర్, ఎమ్మెల్సీ, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల కోసం రూపొందించిన యూనిఫారాలను పంపిణీ చేశారు. ఈనెల 9 నుండి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి, కార్పొరేటర్లు ఏనుగుల మానస రాంప్రసాద్, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమన్, మామిండ్ల రాజు, దేవరకొండ విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్లు ఝాన్సీ, కవిత, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సౌరం ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర...
By Sidhu Maroju 2026-05-01 13:50:59 0 391
SURAKSHA
Manoj Abraham IPS: Driving Innovation and Excellence in Kerala Policing
"A police force becomes stronger when it combines discipline with innovation and public trust."...
By Fathima Safa 2026-07-08 08:00:51 0 192
Andhra Pradesh
స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.
రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు...
By Pagadala Venkateswar 2026-01-27 07:15:14 0 205
Andhra Pradesh
ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న...
By Santhosh Kumar 2026-09-12 09:09:23 0 172
Andhra Pradesh
పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల...
By Kothuru Murali 2026-05-15 15:36:39 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com