ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసింది

0
170

https://x.com/i/status/2042053956826984748

 

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చింది. నాన్న‌కు రాష్ట్రం మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచి ముఖ్య‌మంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంత‌కం చేసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న తీసుకు వ‌చ్చిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు, ప‌థ‌కాలు రాష్ట్ర రూపు రేఖ‌లు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్క‌చెల్లెమ్మ‌లు వారి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్ల‌లు డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, క‌లెక్ట‌ర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్ర‌యాణం కొనసాగుతుంది.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 226
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 2K
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 238
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:02:06 0 181
Telangana
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...
By Sunka Santhosh 2026-06-16 19:43:04 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com