నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
196

నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిమ్మారెడ్డి కుంట చెరువును సందర్శించి కార్యక్రమంపై మాట్లాడారు ఈ కార్యక్రమం మొత్తం 4 దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదట 10 రోజుల్లో పనుల గుర్తింపు, అనంతరం నిధుల మంజూరు, తరువాత 70 రోజుల్లో పనుల అమలు, చివరగా 5 రోజులు రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ చేపడతారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు జరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.తదనంతరం బంగారమ్మ ఆలయాన్ని మరియు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం ఎన్‌టీఆర్ సుజల ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్ ను ప్రారంభించారు.

అలాగే డయాలిసిస్‌తో బాధపడుతున్న హేమరాజు మరియు పక్షవాతం సమస్యతో బాధపడుతున్న లక్ష్మీదేవమ్మను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, ప్యాక్స్ అధ్యక్షులు, నీటి సంఘాల ప్రతినిధులు, ఎల్‌ఎల్‌సీ డీఈ, ఏఈ, సంబంధిత శాఖల సిబ్బంది, మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రజక మహిళపై ఓ కత్తితో దాడి చేతి వేళ్ళకు గాయాలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు రజకులు
చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి...
By Gadiyapudi Narendra 2026-02-18 16:43:44 0 253
Telangana
నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|
హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా...
By Sidhu Maroju 2026-01-28 19:44:38 0 242
Telangana
హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన....
By Sidhu Maroju 2025-09-17 08:31:40 0 325
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
By Kothuru Murali 2026-02-10 07:21:51 0 180
Andhra Pradesh
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు...
By Ratna Sekhar 2026-02-19 19:39:44 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com