మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్.

0
231

 

'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్

09-04-2026 Thu 18:03 | Andhra

Chandrababu Slams Jagans Mavigan Capital Proposal

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు. ఏపీ రాజధానిగా జగన్ 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్‌ను ప్రతిపాదించడంపై ఎద్దేవా చేసిన చంద్రబాబు, "రాజధానిగా వాటికన్‌ను సూచించనందుకు సంతోషం" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక, శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

 

గురువారం బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన ఓ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే కాకుండా మొత్తం 49 పార్టీలు మద్దతిచ్చాయని, కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. "గతంలో ఒక నాయకుడిని సైకో అనేవాళ్లం, ఇప్పుడు ఆ పార్టీ మొత్తమే సైకోగా మారింది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

గతంలో అమరావతి మహిళలను, అసెంబ్లీలో తన భార్యను అవమానించిన వైసీపీ ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. "ఒక సైకో ప్రవర్తనతో రౌడీ బ్యాచ్ పైశాచిక వాదనలు చేస్తోంది. మహిళలను వేధించారు. పత్రికపై దాడి చేశారు. వీటికి ఆ సైకో పార్టీ ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని స్థితిలో ఉంది" అని అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

 

విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపిన ప్రాంతమే సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అనే విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. "విధ్వంసం చేసే వ్యక్తులు స్వేచ్ఛగా తిరిగితే రాష్ట్రంలోని మహిళలకు భద్రత ఎలా ఉంటుంది? అలాంటి వారిని అరెస్టు చేయడానికి నాకు నిమిషం పట్టదు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని హెచ్చరించారు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైందని, విధ్వంసకర శక్తులను ఐక్యంగా ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు

Search
Categories
Read More
Uncategorized
"ఏపీ పవన్ కళ్యాణ్ గారి బాటలో తమిళనాడు విజయ్ దళపతి అడుగులు"
పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. 2019 ఏపీ ఎన్నికల్లో రెండు...
By Thokala Sivaji 2026-03-29 15:30:53 0 703
Telangana
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
By Bheeshman King 2026-07-08 14:15:01 0 190
West Bengal
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
By Lokeshwari Panthadi 2026-06-25 12:15:22 0 91
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 179
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు
నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి...
By Boya Dasthagiri 2026-08-08 14:28:21 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com