ప్రజా కలలను బ్రతికించుకుందాం

0
1K

------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు

మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం కలగజేస్తూ వర్గ సమాజంలో ప్రజల సంస్కృతి  అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు దీనికి విరుద్ధంగా ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని దెబ్బతీసే పాశ్చాత్య సంస్కృతిని పెంపొందిస్తూ సమాజంలోని ప్రజలందరి సంస్కృతిగా అదే ధర్మసంస్కృతిగా రుద్దుతున్నారని విమర్శించారు. వర్గ సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర తప్ప మరేది కాదని ప్రపంచంలోని ప్రజా పోరాటాల నుండి పుట్టిన ప్రజా సంస్కృతే అరుణోదయ సంస్కృతని అన్నారు. కళ కళ కోసం కాదని ప్రజల కోసమని ప్రజల పక్షం వహించినప్పుడే ఆ కళలు  పదికాలాలపాటు ప్రజల్లో అందరించబడతాయని  తెలిపారు.ఈ సభ కు అధ్యక్షత వర్గం గా ఇ. శ్రీశైలం వ్యవరిస్తూ మాట్లాడుతూ..... పాలక పక్షాలు   ప్రజా కళలను విచ్చిన్నం చేసి, పాశ్చాత్య కళలను ప్రోత్సహిస్తూ  తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  ఇటువంటి స్థితిలో కళాకారులు ఐక్యమై ప్రజల పక్షాన ప్రజా పోరాటాల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ముందు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి జెండావిష్కరించి మాట్లాడుతూ అమర కళాకారులకు నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రం లొ కళాకారులతో డప్పు డ్యాన్స్, కోలాట బృందం తో ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న, రాష్ట్ర నాయకులు మోకాళ్ళ మురళి కృష్ణ మాట్లాడుతూ పాట ప్రభుత్వలను ప్రశ్నించాలని, పాట ప్రజల పక్షం నిలవాలని అలాంటి పాట నేడు ప్రభుత్వలకు ఊడిగం చేస్తుందాని  అ విధానాలకు తక్షణమే స్వస్తి పలికి ప్రజా వ్యతిరేక విధానలపై ప్రజలను జాగృతి పలకాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చారి హరీష్, బుర్కా వెంకటయ్య, లింగ్య నాయక్,రాకేష్, నాగరాజు, ఇర్ప రాజేష్, ట్రైబల్ ఫోరం రాష్ట్ర కొ కన్వీనర్. జామ్లా, పూర్ణచందర్, నాగేష్, రామ్ చందర్, రాజా,గట్టి సురేందర్,దితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిఫార్సులకే పెద్దపీట తాగిందుకు మంచినీళ్లు లేవు
*క్యూలైన్లో భక్తుల కష్టాలు.*   *త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు*  ...
By Rajini Kumari 2025-12-30 12:30:50 0 221
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*
తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి...
By Vadlamudi NagaVenkat 2026-03-16 07:52:59 0 584
Bharat Aawaz
Former Jharkhand CM Shibu Soren Passes Away=he also fought for Seperate Jharkhand State
Ranchi / New Delhi, August 4, 2025Veteran tribal leader and former Jharkhand Chief Minister Shibu...
By Bharat Aawaz 2025-08-04 04:48:51 0 1K
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 225
Andhra Pradesh
మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2026-03-03 12:15:33 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com