ప్రతి ఇంటిపైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి -47 వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శరకణం రాజబాబు.

0
515

కిర్లంపూడి, , ఏప్రియల్ 06: ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైనా బిజెపి జెండా ఎగరడమే కాకుండా,గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిర్లంపూడి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో సీనియర్ బిజెపి నాయకుడు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో,జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణ వర్మ పర్యవేక్షణలో బిజెపి సీనియర్ నాయకులు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షులు అల్లు శివరామకృష్ణ

ఆధ్వర్యంలో,నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు మోడీ అందించిన పథకాలను వివరించారు. ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాలను కూడా ప్రజలు మాట్లాడుకునే దిశ గా ఉన్నాయంటే మోడీ చలవే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనేటి శ్రీనివాసరావు,మండల ఓబిసి అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ,మండల కార్యదర్శిలు భీమనాధులు వీరబాబు,ఆడారి రామచంద్రరావు,మండల ఉపాధ్యక్షులు బుద్ధ సత్యనారాయణ,బిజెపి నాయకులు గోలి సుబ్బారావు, అరటా పెద్ద పోలీస్, బాలిమ్ రామకృష్ణ, అప్పారావు,వానపల్లి గంగాధర్,పలికిల సత్యనారాయణ, బొడ్డేటి చిన్నబ్బాయి,పప్పుల రాంబాబు, బొడ్డేటి బాబురావు,రాపేటి కోటేశ్వరరావు,నైదాన రవి, పిట్ట లోవ,కడియాల చిన్న, పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
AI Deepfake Memes: The Escalation of Digital War
The integration of generative AI with meme culture has escalated digital information warfare....
By JoinBMA 2026-08-21 18:42:38 0 308
Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:48:56 0 398
Telangana
హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|
"జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం."...
By Sidhu Maroju 2026-06-29 16:58:19 0 132
Andhra Pradesh
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
By Chennaiah Kati 2026-01-18 07:08:21 0 266
Andhra Pradesh
ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...
By Kiran Kumar 2026-06-22 09:13:57 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com