శిరోరక్ష - ప్రాణ రక్ష: హెల్మెట్ వాడకంపై బాపట్ల పోలీసుల మెగా బైక్ అవగాహన ర్యాలీ.

0
254

చీరాల

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో 'శిరోరక్ష - ప్రాణ రక్ష' పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందు వరుసలో పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు అందరూ హెల్మెట్ ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

చీరాల పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో ఎస్పీ ఉమామహేశ్వర్ పాటు డి.ఎస్.పి మోయిన్, సబ్ డివిజన్ సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు మరియు శక్తి టీం పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం తలకు తగిలే గాయాలే హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి 90% వరకు తప్పించుకోవచ్చని పోలీసులు ప్రజలకు వివరించారు.

గత కొన్ని నెలలుగా జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే, హెల్మెట్ లేకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే వచ్చే 10-15 రోజుల పాటు విద్యార్థులు, యువత, ప్రభుత్వ సిబ్బంది మరియు సామాన్య ప్రజలలో హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పిస్తాం. కేవలం చట్టం కోసమో, జరిమానాల కోసమో కాకుండా, మీ కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ ధరించాలి. పోలీస్ శాఖ నుండే ఈ మార్పు మొదలు కావాలని సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించారు.

 రానున్న రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. బాపట్ల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా బాపట్ల పోలీసులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ, ప్రజల ప్రాణాల రక్షణకు పెద్దపీట వేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పట్టణం: కొత్తూరు మురళిపుంగనూరులో జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు...
By Kothuru Murali 2026-03-09 04:18:20 0 192
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దపంజాణి మండలం రాయల్‌పేట జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా...
By Kothuru Murali 2026-05-04 13:18:29 0 136
Telangana
జగద్గిరిగుట్టలో భక్తి వెల్లువ.. బోనాల పండుగ వైభవం.|
● అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్ ● తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాలు...
By Sidhu Maroju 2026-08-09 07:41:54 0 149
Andhra Pradesh
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
By Boiena Rajesh 2026-04-02 05:14:00 0 245
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్...
By Boiena Rajesh 2026-03-21 10:54:58 0 374
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com