Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.

0
469

Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం

05-04-2026 Sun 19:43 | Andhra

RTC Bus Fire in Kadapa District All Passengers Safe

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో వేంపల్లి నుంచి కదిరికి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లి వద్దకు రాగానే, రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. బస్సు లోపల పొగలు, మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

 

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బస్సు కాలి బూడిదైంది.

 

విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
అనాథలు మరియు పేదలకు అండగా
సమాజంలో అభాగ్యులకు, అనాథలకు తెలంగాణ పోలీసులు నిన్న ఆసరాగా నిలిచారు. తమ వ్యక్తిగత బాధ్యతగా పలువురు...
By Kalaga Sailaja 2026-06-27 06:36:44 0 92
Andhra Pradesh
పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య
పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో...
By Kothuru Murali 2026-02-11 08:40:19 0 186
Telangana
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...
By Thalakokkula Sadanandam 2026-04-12 02:03:57 0 610
Andhra Pradesh
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
రాయచోటి నియోజకవర్గం. రామాపురం మండలం. (16-03-2026)   రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన...
By Benguluri Madhubabu 2026-03-17 07:35:28 0 227
Andhra Pradesh
మిద్దెపై నుంచి పడి ఎంబీఏ విద్యార్థికి తీవ్ర గాయాలు.
పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై...
By Pagadala Venkateswar 2026-05-09 07:52:57 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com