ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

0
299

బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారని హెల్మెట్ నే ప్రాణానికి రక్షణ కవచమని ప్రజలు తెలుసుకోలేక పోతున్నారని వారు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ముందు వారికి ఒక కుటుంబం ఉందని ఆలోచించాలని నష్టం జరిగిపోతే కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాలని మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని వారు కోరారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మైన డ్రైవర్ని ప్రోత్సహించేది లేదని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి జిల్లా కందుకూరు మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం
*ప్రకాశం జిల్లా తేది:29.01.2026*   *ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్...
By Rajini Kumari 2026-01-29 13:44:29 0 415
Andhra Pradesh
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్ 30-01-2026 Fri 16:44 | Andhra Nara...
By Pagadala Venkateswar 2026-01-31 06:38:19 0 213
Telangana
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...
By Nookapangu Manikanta 2026-05-15 14:26:09 0 342
Andhra Pradesh
టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్.
  టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్ 01-05-2026 Fri 22:25...
By Pagadala Venkateswar 2026-05-02 04:09:58 0 134
BMA
Censoring Satire: The IT Rules and Meme Takedowns
The Indian government’s aggressive use of IT Rules to demand the takedown of political meme...
By JoinBMA 2026-08-21 18:43:39 0 364
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com