డీప్‌ఫేక్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ అవగాహన సందేశం |

0
207

హైదరాబాద్ : డిజిటల్‌ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి .సజ్జనర్ ఐపీఎస్ సూచించారు. 

ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పించే సందేశాన్ని విడుదల చేశారు.

ఏఐ సాంకేతికతను ఉపయోగించి నిజంలా కనిపించే నకిలీ వీడియోలు, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

అలాంటి కంటెంట్‌ను చూసిన వెంటనే నమ్మకుండా ముందుగా జాగ్రత్తగా పరిశీలించాలని ప్రజలను హెచ్చరించారు.

డీప్‌ఫేక్‌ వీడియోలు లేదా ఫొటోలను నిశితంగా గమనిస్తే లైటింగ్‌లో తేడాలు, ముఖ కవళికల్లో సహజత్వం లేకపోవడం, కదలికల్లో అసహజత్వం వంటి లక్షణాల ద్వారా అవి నకిలీ అని గుర్తించవచ్చని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు.

ఏదైనా వీడియో లేదా ఫొటోపై అనుమానం వచ్చినప్పుడు వెంటనే రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా ఆ కంటెంట్ అసలు ఎక్కడిదో తెలుసుకోవచ్చని సూచించారు.

వాస్తవాలను నిర్ధారించుకోకుండా భావోద్వేగానికి లోనై ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే సమాజంలో అశాంతికి కారణమయ్యే ఫేక్ న్యూస్ వ్యాప్తిలో మనమూ భాగస్వాములు అవుతామని హెచ్చరించారు.

కాబట్టి సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో లేదా ఫొటోను షేర్‌ చేసే ముందు “ఆలోచించండి – నిర్ధారించుకోండి – తర్వాతే షేర్ చేయండి” బాధ్యతాయుతమైన విధానాన్ని పాటించాలని హైదరాబాద్ సీపీ ప్రజలకు సూచించారు.

డీప్‌ఫేక్‌ల యుగంలో విమర్శనాత్మక ఆలోచన, సమాచారాన్ని ధృవీకరించే అలవాటు ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన రక్షణగా మారిందని ఆయన తెలిపారు.

#sidhumaroju

Alwal

 

Search
Categories
Read More
BMA
Information Defense: Press Countering Foreign Psy-Ops
A strong, independent domestic press plays a crucial role in defending national security by...
By JoinBMA 2026-08-21 10:54:04 0 95
Telangana
మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్
మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు...
By Bonagiri RaviShankar 2026-06-03 04:53:52 0 202
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 262
Telangana
గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన...
By Avunoori Mahesh 2026-05-13 14:46:34 0 230
Andhra Pradesh
కృష్ణ మిల్క్ యూనియన్ 36వ సర్వసభ్య సమావేశం
కృష్ణా మిల్క్ యూనియన్ 36 వ సర్వ సభ్య సమావేశం  పాల సేకరణ ధర పెంపు - భారత దేశంలోనే అత్యధిక...
By Rajini Kumari 2026-03-28 14:29:57 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com